జిల్లాలో 181 రైతు గ్రూపులకు 169 ట్రాక్టర్లు, 12 వరి కోత యంత్రాలు పంపిణీ

  • Post category:Nandyal

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్నదాతలను ఆదుకునేందుకు వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 181 గ్రూపులకు 169 ట్రాక్టర్లు 12 వరి కోత యంత్రాలు పంపిణీ చేసామని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైయస్సార్ సెంటినరీ హాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద 5,500 గ్రూపులకు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా,స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిషా, దృశ్య కళల డైరెక్టర్ సునీత, బెస్తవారి సంఘ డైరెక్టర్ చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, రైతులు తిలకించారు. అనంతరం ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేఖరులతో జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ రైతుల పెట్టుబడిని తగ్గించి అధిక దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 181 గ్రూపులకు 169 ట్రాక్టర్లు 12 వరి కోత యంత్రాలు పంపిణీ చేసామన్నారు. ఒక్కో ట్రాక్టర్ ధర 15 లక్షల రూపాయలు కాగా ఇందులో 50 శాతం బ్యాంకు రుణం, 40 శాతం సబ్సిడీ పోగా కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారుడు చెల్లించాలి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ యంత్రాల వాహనాల కింద జిల్లాకు 10 కోట్ల రూపాయల సబ్సిడీ వచ్చిందని కలెక్టర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, ఈ క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కింద వ్యవసాయ వాహనాలు, యంత్ర పరికరాలు పంపిణీ చేసి రైతు గర్వంగా చెప్పుకునేలా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు గ్రామస్థాయిలోని రైతు భరోసా కేంద్రాల పరిధిలో సన్న, చిన్న కారు రైతులు గ్రూపుగా ఏర్పాటై రిజిస్ట్రేషన్ చేసుకుంటే ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు మంజూరు చేస్తానన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా వ్యవ వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 5,500 రైతు గ్రూపులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ యంత్ర వాహనాలు పంపిణీ చేసారన్నారు. వ్యవసాయ కూలీలు పెరిగిపోతున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు వ్యవసాయ వాహన, యంత్ర పరికరాలు పంపిణీ చేసి ఆదుకుంటుందన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాల కింద 1500 కోట్లు అప్పు పెట్టినప్పటికీ వాటినన్నిటిని చెల్లించి… నూతనంగా వ్యవసాయ వాహన, యంత్ర పరికరాలను సబ్సిడీపై రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారన్నారు. అలాగే రైతులకు ప్రతి రోజు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. శాసనమండలి సభ్యులు ఇసాఖ్ బాషా మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన ప్రభుత్వం విత్తు నుండి పంట కోత వరకు రైతులకు అండగా వుంటుందన్నారు. వరి కోత మిషన్ లపై 8 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అనంతరం పంపిణీ చేసిన ట్రాక్టర్లు, వరి కోత మిషన్ల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.