You are currently viewing సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ మృతి పట్ల పి.డి.ఎస్.యూ జిల్లా కమిటీ సంతాపం

సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ మృతి పట్ల పి.డి.ఎస్.యూ జిల్లా కమిటీ సంతాపం

  • Post category:Nandyal

నంద్యాల సీనియర్ జర్నలిస్టు పంచాంగ్నుల చంద్రశేఖర్ ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమని ఆయన మృతి పట్ల పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.డి.రఫీ సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నంద్యాల పట్టణంలో ప్రముఖ ఉపాధ్యాయులు నంద్యాలలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ భాగస్వాములు అయినా పంచాంగ్నుల సుబ్రహ్మణ్యశాస్త్రి కుమారుడు పంచాంగుల చంద్రశేఖర్ గురువారం రాత్రి స్పృహ కోల్పోయిన ఆయనను నంద్యాల జిల్లా ఆసుపత్రి నందు అడ్మిట్ చేయగా రాత్రి పొద్దుపోయాక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికు తరలించడం జరిగింది. అనంతరం శుక్రవారం10 గంటలకు తుది శ్వాస విడిచడం బాధాకరమని అన్నారు. నంద్యాల పట్టణంలో పి. చంద్రశేఖర్ గత మూడు దశాబ్దాలుగా వామపక్ష విద్యార్థి యువజన కార్మిక సంఘాల్లో చురుగ్గా పాల్గొన్నాడని అదే క్రమంలో జర్నలిజం వైపు మొగ్గు చూపి వివిధ పత్రికలలో జర్నలిస్టుగా పనిచేసి పేరు ప్రఖ్యాతలు గడించాడు అని ఆయన తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు. అపార అనుభవం జ్ఞానము కలిగిన చంద్రశేఖర్ మృతి తీరనిలోటని ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.