నంద్యాల సీనియర్ పాత్రికేయులు అనారోగ్యంతో కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉదయం పంచాగ్నుల చంద్రశేఖర స్వామి చనిపోయ్యారు. నిస్వారథంగా అజాతశత్రువుగా పేదల పక్షపాతి, నిష్పక్షపాతంగా సుమారు 38 ఏళ్లు జర్నలిజంలో పనిచేశారు. గతంలో వార్తాపత్రిక ,ఆంధ్రజ్యోతి, ప్రభ పత్రిక నందు సంచలనాత్మకమైనటువటి వార్తలు రాసి ఆదర్శంగా నిలిచారు. వీరి తండ్రి కూడా మంచి నిజాయితీగల కమ్యూనిస్టు నాయకుడు అదే పంథాలో ఆదర్శంగా అవివాహితుడుగా ఉంటూ సమాజసేవ చేశారు. పేదల వైపు నిలిచి సుదీర్ఘ ప్రయాణం చేసి జర్నలిజం విలువలను కాపాడిన వ్యక్తి జర్నలిస్టులకు మనోధైర్యాన్ని నేర్పి ఎంతోమందికి వార్తల సేకరణ చేయించడంలో తర్ఫీదు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు జర్నలిస్టులకు ఆదర్శప్రాయంగా నిలిచి మానవతా విలువలను చాటి చెప్పి ఎంతో మంది జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారు.

నంద్యాల సీనియర్ పాత్రికేయులు చంద్రశేఖర స్వామి మృతి
- Post published:June 3, 2022
- Post category:Nandyal