You are currently viewing 108 వాహనం మండల కేంద్రంలో నిలపాలి.

108 వాహనం మండల కేంద్రంలో నిలపాలి.

  • Post category:Nandyal

మహానంది మండలానికి కేటాయించిన 108 వాహనాన్ని మండల కేంద్రమైన మహానందిలో నిలపాలని మండలానికి చెందిన పలువురు నంద్యాల జిల్లా డి.ఎం.హెచ్.ఓ కార్యాలయంలో డిప్యూటీ డి డి.ఎం.హెచ్.ఓ అంకిరెడ్డికి వినతి పత్రం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి కేటాయించిన 108 వాహనాన్ని మహానంది మండల పరిధిలో కాకుండా నంద్యాల చెరువు కట్ట వద్ద నిలుపు తున్నారని పేర్కొన్నారు. మండల పరిధిలో ప్రమాదాలు జరిగితే 108 సిబ్బంది పలు కారణాలు చూపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఎం. తిమ్మాపురం, బొల్లవరం గ్రామాలలో పాము కాటుకు గురైన బాధితులు 108కు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదని పేర్కొన్నారు. వైద్య శాఖ అధికారులు 108 వాహనం మహానంది మండల కేంద్రంలో నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు . మండలంలో ప్రమాద సంఘటన జరిగితే వాహనము రావడానికి ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ అంకిరెడ్డి స్పందిస్తూ మహానంది మండలానికి కేటాయించిన 108 వాహనం మహానందిలోనే ఉండాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో కాకర్ల శివ, తోట కిట్టు జి నాగరాజు, రమణయ్య, రమేష్ పాల్గొన్నారు.