You are currently viewing విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు జగన్ అన్న పెద్ద పీట

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు జగన్ అన్న పెద్ద పీట

  • Post category:Nandyal

-ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల పట్టణంలోని పదో వార్డు మూలన్ పేట నందు నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 1కోటి 60లక్షల రూపాయలతో ఉర్దూ పాఠశాలకు భూమి పూజ నిర్వహించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ మభూన్నిసా, మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషావలి, వార్డు కౌ న్సలర్ అబ్దుల్ మజీద్, కో ఆప్షన్ మెంబర్ సలాం ముల్లా, మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా విద్య వైద్యానికి పెద్దపీట వేశారని నేడు- నాడు కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణం మూలన్ పేటలో ఉర్దూ పాఠశాల నూతన గదుల కోసం 1కోటి60లక్షల రూపాయలతో భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు కోసం బంగారు బాట వేశారని గతంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేశారని అన్నారు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయినవెంటనే విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి మన బడి నాడు నేడు కార్యక్రమం అమ్మఒడి, విద్య దీవెన, విద్య కనుక పథకాలను ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.