11వ విడతగా రూ.21 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ

  • Post category:Nandyal

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలపై హిమాచల్ ప్రదేశ్ సిమ్లా నుండి జాతీయ స్థాయి వర్చువల్ విధానం ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్త కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం వైఎస్సార్ సెంటినరీ హాలులో లైవ్ ద్వారా ప్రసారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నందికొట్కూర్ శాసనసభ్యులు తోగూర్ ఆర్థర్, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్వో పుల్లయ్య, డ్వామా పిడి బాలకృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు. గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం- కిసాన్) పథకం కింద దాదాపు 10 కోట్లకు పైగా రైతులకు 11వ విడతగా రూ.21 వేల కోట్ల రూపాయలను రిమోట్ బటన్ నొక్కి రైతుల ఖాతాలలో ప్రధాన మంత్రి జమచేశారు. అంతకు ముందు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, పట్టణ), ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన, పోషన్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ, పట్టణ), జల్ జీవన్ మిషన్, అమృత్, ప్రధాన మంత్రి ఎస్.వి.ఏ నిధి పథకం, ఒకే జాతి ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్ వన్ రేషన్ కార్డు), ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్మాన్ భారత్ పి.ఎం జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్, ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాల లబ్ధిదారులతో ప్రధానమంత్రి చర్చాగోష్ఠి నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాన మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం మరింత సామాజిక-ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని పిలుపునిచ్చారు.