You are currently viewing సిద్దేశ్వరం అలుగు జల దీక్షకు ఎలాంటి అనుమతులు లేవు

సిద్దేశ్వరం అలుగు జల దీక్షకు ఎలాంటి అనుమతులు లేవు

  • Post category:Nandyal

-నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని

నేడు రాయలసీమ జిల్లాల నుంచి నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కృష్ణా నది పై సిద్దేశ్వరం అలుగు నిర్మాణం పనులు చేపట్టాలని చేస్తున్న జల దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని నంద్యాల జిల్లా కలెక్టర్ మన జీర్ జిలాని పేర్కొన్నారు. సోమవారం ఆత్మకూరు ఆర్ డి ఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిద్దేశ్వరం అలుగు జల దీక్షకు ఎలాంటి అనుమతులు రాలేదని అని వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలనలో ఉందని వివరించారు. త్వరలోనే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు పోయే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.