You are currently viewing శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా 178 మంది మహిళలకు రూ.20లక్షల 2వేలు రుణాలను పంపిణీ చేసిన బ్యాంక్ చైర్పర్సన్ నాగినిరవి సింగారెడ్డి

శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా 178 మంది మహిళలకు రూ.20లక్షల 2వేలు రుణాలను పంపిణీ చేసిన బ్యాంక్ చైర్పర్సన్ నాగినిరవి సింగారెడ్డి

  • Post category:Nandyal

నంద్యాల పట్టణం టెక్కె మార్కెట్ యార్డులో సోమవారం శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా 178 మంది మహిళలకు 20 లక్షల బ్యాంక్ చైర్ పర్సన్ నాగినిరసింగారెడ్డి పంపిణీ చేశారు. రుణాలు పొందిన మహిళలు ఆత్మగౌరవంతో శ్రద్ధతో, కష్టపడి పనిచేసి గౌరవంగా జీవించాలని నాగినిరవిసింగారెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ హరిలీల, డైరెక్టర్ పూర్ణియ, ముఖ్యఅతిధిగా ఇసిత హాజరయ్యారు. ఈ సందర్భంగా శిల్పామహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగినిరసింగారెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్ర్యం సాధించేందుకు కృషిచేయాలని, చేస్తున్న పని ఏదైనా ఆత్మగౌరవంతో కష్టపడి పనిచేయాలని సంతోషంగా జీవించాలని కోరారు. ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా మహిళల అభివృద్ధికి చేపడుతున్న ప్రతి కార్యక్రమం మహిళలకు స్వాలంభనగా ఆదర్శంగా ఉందని ఇసిత అభినందించారు.