You are currently viewing రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు ఎంపికైన జిల్లా జట్టు

రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు ఎంపికైన జిల్లా జట్టు

  • Post category:Nandyal

ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ గీతం యూనివర్సిటీ లో నిర్వహించనున్న గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ చదరంగం పోటీలలో కర్నూలు, నంద్యాల జిల్లాల జట్టు తరఫున పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయడం కోసం కర్నూల్, నంద్యాల జిల్లాల చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ జి నంద్యాల చెస్ అకాడమీ నిర్వహణలో స్థానిక నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించిన చదరంగం పోటీలలో 15 సంవత్సరాల లోపు బాలుర విభాగంలో డోన్ కు చెందిన హర్షిత్, బాలికల విభాగంలో కర్నూల్ కు చెందిన హాసిని ఎంపికయ్యారు. వివిధ వయసు కేటగిరీలలో బాలికలలో 15 సంవత్సరాల లోపు విభాగంలో అదితి సత్య, 12 సంవత్సరాల లోపు విభాగంలో సింగారెడ్డి సస్య ,9 సంవత్సరాల లోపు విభాగంలో శాలిని, బాలుర విభాగంలో సాయి హరీష్, లక్షిత్, జోషిత్ రెడ్డి, విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు, నగదు బహుమతులు నాగ శ్రీనిష్, హర్షిత, భాను ప్రకాష్ లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ కర్నూల్ చెస్ గౌరవ అధ్యక్షుడు, ఐ ఎం ఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రధానోత్సవం లో శిల్పా మహిళా బ్యాంక్ చైర్మన్, వైఎస్ఆర్సిపి నాయకురాలు కౌన్సిలర్ సింగారెడ్డి నాగిని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగినీ రెడ్డి మాట్లాడుతూ చదరంగం క్రీడ బాలల్లో మేధస్సుకు పదును పెడుతుందని, ఏకాగ్రత ఇనుమడిస్తుందని, క్రమశిక్షణతో సాధన చేస్తే ఉన్నత స్థాయి విజయాలు సాధించవచ్చని అన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు. అందుకు తగిన తర్ఫీదు ఇవ్వాలని శిక్షకులను కోరారు. ఈ కార్యక్రమంలో నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నెరవాటి కృష్ణ సాయి రోహిత్, ప్రిన్సిపల్ అనిల్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి రామసుబ్బారెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇమామ్, క్రీడాకారులు, తల్లిదండ్రులు, శిక్షకులు పాల్గొన్నారు.