- సభకు హాజరైన బి.సి. ఎస్.సి.ఎస్.టి.మైనారిటీ కి చెందిన 17మంది మంత్రులు
- నిన్న అర్థరాత్రి తర్వాత తెల్లవారుజాము 3 గంటలకు నంద్యాల జిల్లాకు చేరుకున్న మంత్రుల బస్సు
- అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము 3 గంటలవు తున్నప్పటికీ జిల్లా శివారు ప్రాంతం అయ్యలూరు మెట్ట నుండి భారీ ఊరేగుంప
- నంద్యాల పట్టణంలో ఇంద్రప్రస్థ, ఉదయానంద రెజెన్సీ, హోటల్ సూరజ్ గ్రాండ్ లలో మంత్రుల బస
- వైఎస్సారీసీ సామాజిక న్యాయభేరీలో భాగంగా నాలుగో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది.
- 2500 బైకులతో భారీ ర్యాలీలో పాల్గొన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ యువకులు
స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటి నుండి రాజ్ థియేటర్, మునిసిపల్ కార్యాలయం, సంజీవనగర్ గేట్ మీదుగా శ్రీనివాస సెంటర్ వరకు భారీ బైకు ర్యాలీ. ఉత్సాహముతో యువకుల కేరింతలతో నంద్యాల పట్టణ వీధుల్లో కొనసాగిన ర్యాలీ. శ్రీనివాస సెంటర్ లో ఏర్పాటు చేసిన సభకు భారీ సంఖ్యలో హాజరైన నంద్యాల పట్టణ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు సభలో ప్రసంగించారు. బడుగు, బలహీన,అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించదమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనత ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒకేసారి 17 మంది బి.సి, ఎస్.సి,ఎస్.టి,మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 25 మంది ఉన్న కేబినెట్ లో ఏకంగా 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు క్యాబినెట్ హోదా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే కుల మతాలు, పార్టీలకతీతంగా ఎక్కడా వివక్ష , అవినీతికి తావులేకుండా, దళారుల ప్రమేయం లేకుండా, అర్హతే కొలమానంగా సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రులు తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న తమకు జగన్ రాకతో మేలు జరిగిందన్నారు. ఎక్కడా గుర్తింపు లేకుండా ఉన్న 56 కులాలకు కార్పొరేషన్ పదవులు కేటాయించి జగన్ సామాజిక న్యాయం చేశారని చెప్పారు. జగన్ పాలన పది కాలాల పాటు ఉండాలని కోరుకుందామన్నారు. బడుగు బలహీన వర్గాల ఐక్యత కొనసాగాలని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కొనసాగుతోందని, అందులో ఎక్కువ లబ్ధి పొందుతున్నది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ నేత చేయలేని న్యాయాన్ని సీఎం జగన్ అందించారని తెలిపారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. ఎస్సీ, బీసీ, కాపు, ఈబీసీ మహిళలకు మేలు చేస్తున్నారని చెప్పారు. మంత్రులు పలుచోట్ల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. 40 డిగ్రీల మండుటెండలోనూ జనం పోటెత్తారు. యాత్ర పొడవునా ప్రజలు మంత్రులకు స్వాగతం పలికారు.
నంద్యాల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర పాణ్యం మీదుగా కర్నూలు చేరుకొని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రానికి అనంతపురం చేరుకొని అక్కడి బహిరంగ సభతో ముగియనుంది.