ఆయుష్ యోగ సేవాసమితి నిర్వాహకులు ఖండే ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ యోగా కేంద్రంలో జూన్ ఒకటవ తేదీ అనగా బుధవారం నుండి ఉదయం 5:20 నుండి 6:30 వరకు మరియు 6 30 నుండి 7:30 వరకు 17 నుండి 70 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమగును అని తెలియజేశారు ఈ శిబిరం నందు సూర్య నమస్కారములు క్రియలు ఆసనములు ప్రాణాయామము ధ్యానము నేర్పబడును అలాగే ఊబకాయం ఉన్న వారికి నడుము నొప్పి ఉన్న వారికి బిపి షుగర్ వ్యాధిగ్రస్తులకు విడివిడిగా శిక్షణను ఇవ్వగలరని ఇవ్వగలరు అని తెలియజేశారు. అలాగే ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు 10 నుండి 17 సంవత్సరముల వయస్సు గల బాలబాలికలకు యోగాతో పాటు బాలల వ్యక్తిత్వం వికాస యోగ శిక్షణా తరగతులు కూడా కలవని తెలిపారు పిల్లలకు మానసిక ప్రశాంతత కొరకు ఏకాగ్రతకు జ్ఞాపక శక్తికి మరియు సమాజం పట్ల కుటుంబం పట్ల తల్లిదండ్రుల తో మరియు అన్న దమ్ముల మధ్య బాధ్యతగా ఎలా మెలగాలి అనే వాటిపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆటలు పాటలు కోలాటం ఏరోబిక్స్ మొదలగునవి కూడా నేర్పబడును తెలిపారు కావున ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరు కావలసిందిగా కోరడమైనది. హాజరు అగువారు యోగా మ్యాట్ లేదా బెడ్ షీట్ వాటర్ బాటిల్ పెన్ను నోట్ బుక్ తీసుకొని ఐదు నిమిషాలు ముందుగా యోగ శిబిరము చేరవలెను అని తెలిపారు. వివరములకు 9704019365, 99899 83673 కాల్ చేయగలరు.

ఆయుష్ ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
- Post published:May 29, 2022
- Post category:Nandyal