ఈ నెల 30వ తేది ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో స్పందన

  • Post category:Nandyal

-జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం 30వ తేదిన “స్పందన” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ లోని ఆర్డీఓ కార్యాలయంలో “స్పందన” కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి ఈ నెల 30వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లాస్థాయిలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్.ఏ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో కూడా యథాతథంగా ప్రజాఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఆత్మకూరు డివిజన్ కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.