You are currently viewing మే 31న జరిగే సిద్దేశ్వరం జలదీక్షను విజయవంతం చేయండి

మే 31న జరిగే సిద్దేశ్వరం జలదీక్షను విజయవంతం చేయండి

  • Post category:Nandyal

రాయలసీమ ప్రజల స్పందన సిద్దేశ్వరం అలుగును వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సంఘం, ప్రజా సంఘాల ఐక్యవేదిక కొమ్మ శ్రీ హరి ఆధ్వర్యంలో గోడపత్రిక విడుదల చేశారు. స్థానిక పట్టణంలోని పీపుల్స్ క్లబ్ నందు సిద్దేశ్వరం అలుగు- రాయలసీమ వెలుగు అనే నినాదంతో సిద్దేశ్వరం జలదీక్ష గోడ పత్రికను కొమ్మ శ్రీ హరి చేతుల మీదుగా విడుదల చేశారు. నిత్యం కరువుతో సహజీవనం చేస్తున్న రాయలసీమ ప్రజానీకం తమ హక్కుల కోసం పోరాడితే తమ కష్టాలు తొలగిపోతాయి అన్నారు. రాయలసీమ న్యాయమైన కోరికలు సాధన కోసం సిద్దేశ్వరం దగ్గర జరిగే జల దీక్ష కార్యక్రమంలో రాయలసీమ ప్రజానీకం ప్రజాస్వామ్య వాదులుఅంతా స్వచ్చందగా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని మే 31న జరిగే జల దీక్ష కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆయకట్టు రైతులు గుడిపాటి వెంకటయ్య, కందాల కృష్ణమూర్తి, అరిగెల చిన్న తిమ్మయ్య, దండే సుధాకర్, గుడిపాటి సూర్యనారాయణ, పాండురంగారావు, తిరుపతయ్య, మొహమ్మద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.