శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రశాంత్ కుమార్ మిశ్రాకి పుష్ప గుచ్చం అందజేసి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్, జిల్లా ఎస్.పి. రఘువీర్ రెడ్డి, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న తదితరులు పాల్గొన్నారు.
