You are currently viewing వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అంబేడ్కర్ మహనీయుని పేరు వాడుకుంటుంది

వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అంబేడ్కర్ మహనీయుని పేరు వాడుకుంటుంది

• జిల్లాల ప్రకటన సమయంలో కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు అమలాపురంకు ఎందుకు పెట్టలేదు

• ప్రభుత్వ పథకాలకు అంబేడ్కర్ మహనీయుని పేరు పెట్టాలి

• అంబేడ్కర్ మహనీయుని పేరుతో రాష్ట్రంలో లా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి

• అంబేడ్కర్ ఒక జాతీ నాయకుడు కాదు, భారతీయులందరూ ఆరాధించే గోప్ప వ్యక్తి

• అమలాపురం అల్లర్లు, ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య కేసులను సిబిఐకి అప్పగించాలి

• కర్నూలుకు దామోదరం సంజీవయ్య, బెజవాడకు వంగవీటి రంగా, అనంతపురంకు శ్రీ కృష్ణ దేవరాయలు పేర్లు పెట్టాలి

• కాపు సంక్షేమ యువ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి వెంకటేశ్వర్లు

వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అంబేడ్కర్ మహనీయుని పేరు వాడుకుంటుందని కాపు సంక్షేమ యువ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు ఉన్న కాపు భవనంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాల ప్రకటన సమయంలో కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు అమలాపురంకు ఎందుకు అంబేడ్కర్ కోనసీమగా పేరు పెట్టలేదని ప్రశ్నించారు. భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఒక జాతీ నాయకుడు కాదని, భారతీయులందరూ ఆరాధించే గోప్ప వ్యక్తి అని అన్నారు. ప్రపంచ మేధావి భారత రత్న డా. బిఆర్ అంబేడ్కర్ పేరును కొత్త జిల్లాకు ” కోనసీమ అంబేడ్కర్ జిల్లా” అంటూ పేరు పెట్టడం చంద్రుడికో నూలుపోగు లాంటిదని, అదేం గొప్ప విషయం కాదు…. కానీ అనవసరంగా స్వార్ధ రాజకీయాల కోసం వైసీపీ దీన్ని తెరమీదికి తెచ్చిందని అన్నారు. ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యను అందిచండం కోసం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని ఎందుకు రద్దు చేసిందో చెప్పాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు అన్ని ఇతర కార్యక్రమాలకు మళ్లించి ఎస్సీ కార్పొరేషన్ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలను పన్నుల రూపంలో, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ రూపంలో దోచుకుంటూ ఆ డబ్బును అనవసర ఖర్చులు చేస్తోందన్నారు. మూడు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా అని చెప్పి ప్రశ్నించారు. మరోపక్క ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.35 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయకుండా వైసిపి ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఆలోచనను దారి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమే అమలాపురం అల్లర్లు అని అన్నారు. అంబేడ్కర్ మహనీయుని పేరుతో రాష్ట్రంలో వెయ్యి ఎకరాలలో లా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని, కర్నూలుకు దామోదరం సంజీవయ్య, బెజవాడకు వంగవీటి రంగా, అనంతపురంకు శ్రీ కృష్ణ దేవరాయలు పేర్లు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమలాపురం అల్లర్లు, ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య కేసులను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన నాయకులు పాల్గోన్నారు.