- తహసీల్దార్ ను కలిసిన జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్
నంద్యాల: గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ తన కార్యవర్గంతో కలిసి నంద్యాల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తో జిపిఎస్ నాయకులు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా గిరిజనులకు గుడి నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని ఎన్నో వినతి పత్రాలు సమర్పించామని అధికారులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. గిరిజనులకు ఆరాధ్యదైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, మారెమ్మ తల్లి దేవాలయాల నిర్మాణాలకు స్థలం కేటాయించాలని కోరారు. నందమూరి నగర్, వైయస్ నగర్ లో కానీ పట్టణంలోని ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో 50 సెంట్లు దేవాలయాల నిర్మాణానికి ఇవ్వాలని కోరారు. జి పి ఎస్ నాయకులు అడిగిన మేరకు ప్రభుత్వ స్థలం ఎక్కడ ఖాళీ ఉందో చూసి కలెక్టర్ అనుమతితో స్థలం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.