You are currently viewing ఆళ్లగడ్డ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఆళ్లగడ్డ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

  • Post category:Nandyal

వైయస్సార్ హెల్త్ క్లినిక్, ఆళ్లగడ్డ అర్బన్, జంబులదిన్నె, చింతకుంట గ్రామ సచివాలయాలను,

రైతు భరోసా కేండ్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రజలకు మెరుగైన సేవలందించండి

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ఆళ్లగడ్డ: నిత్యం ప్రజలకు అందుబాటులో వుండి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన సర్వీసులు అందించాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆళ్లగడ్డ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు వైయస్సార్ హెల్త్ క్లినిక్, ఆళ్లగడ్డ అర్బన్, జంబులదిన్నె, చింతకుంట గ్రామ సచివాలయాలను రైతు భరోసా కేండ్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ విధినిర్వహణలో అలసత్వం వహించినా, నిర్దేశించిన నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైనా, నిర్ణీత గడువులోపు పూర్తి చేయకపోయినా సంబంధిత అధికారును ఎవరినీ ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తొలుత ఆళ్లగడ్డ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శిస్తూ సిబ్బంది హాజరు పట్టికను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తహసీల్దార్, ఎంపిడిఓ, ఆర్.డబ్ల్యూ.ఎస్, హౌసింగ్, ఐసిడిఎస్, మునిసిపల్ కమీషనర్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన ఫిర్యాదులకు సంబంధించి ఎన్ని పెండింగ్ లో వున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పందన వినతులపై తక్షణమే స్పందించి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జగనన్న లేఅవుట్ లలో ఇంటి నిర్మాణాలకు అవసరమైన నీటి సమస్య లేకుండా చూడాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం జంబులదిన్నె రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ప్రభుత్వం రైతులకు అన్ని సదుపాయాలు కల్పిం చేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేసిందని వ్యవసాయ సిబ్బంది ఖరీఫ్ సీజన్ కు అవసరమయ్యే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను సబ్సిడీపై పంపిణీ చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల కొనుగోలుపై రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న బిందు సేద్యం, స్ప్రిక్లర్లు కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకొనెలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన తీసుకరావాలన్నారు. జంబులదిన్నె, చింతకుంట గ్రామ సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో వుండి ప్రజలను మెచ్చుకునే రీతిలో సర్వీసులు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సర్వీసులపై వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటూ ఏ ఒక్కటి పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులోగా సర్వీసులు అందించాలని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీ లేఅవుట్ లో జరుగుతున్న ఇంటి నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.