You are currently viewing డాక్టర్ దస్తగిరి రెడ్డి సేవలు ప్రశంసనీయం -ఎంపి పోచా, ఎమ్మేల్యే శిల్పా

డాక్టర్ దస్తగిరి రెడ్డి సేవలు ప్రశంసనీయం -ఎంపి పోచా, ఎమ్మేల్యే శిల్పా

  • Post category:Nandyal

నంద్యాల: డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డికి ఇటీవల రాయలసీమ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా పట్టణంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంస్థలు, సాంస్కృతిక,క్రీడా, సాహితీ సంఘాల ఆధ్వర్యంలో, నిర్వాహక కమిటీ కన్వీనర్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన స్థానిక డి వై ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శాసనసభ్యులు శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఇసాక్ భాష, పురపాలక చైర్ పర్సన్ మాబున్నీసా, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని నిర్వాహక కమిటీ తరఫున డాక్టర్ దస్తగిరి రెడ్డి ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ దస్తగిరి రెడ్డి ఒకసారి ఫీజు కడితే ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని నిర్వహించి దేశవ్యాప్తంగా 84 ఆర్గనైజేషన్ ల యందు 38 వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగాలు సాధించడానికి కృషి చేశారని ప్రశంసించారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా తను పుట్టి పెరిగిన మంగపల్లె ప్రాంతంలో ఆసుపత్రి నిర్మించి, ప్రతి నెల ప్రత్యేక వైద్య నిపుణులతో భారీ వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి కుటుంబం నుండి ఒకరు బ్యాంకర్ గా స్థిరపడాలన్నవారి ఆశయం చాలా గొప్పదన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ దస్తగిరి రెడ్డి సాంస్కృతిక , క్రీడా కార్యక్రమాలు కూడా నిరంతరం నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. పురపాలక చైర్ పర్సన్ మాబున్నీసా మాట్లాడుతూ దస్తగిరి రెడ్డి కి డాక్టరేట్ ప్రదానం చేయడం నంద్యాలకు గర్వకారణమన్నారు. రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఐదు మందితో ప్రారంభమైన వీరి శిక్షణా కేంద్రం 34 సంవత్సరాలలో నేటికి వేలాది మందికి ఉపాధి కల్పించిన సంస్థ గా ఎదగడానికి, లాభాపేక్ష కన్నా సేవా దృక్పథంతో దస్తగిరి రెడ్డి నిరంతరం పాటుపడ్డారని కొనియాడారు. ఐ ఎమ్ ఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దస్తగిరి రెడ్డి మారుమూల పల్లె లో సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందుకునే దశ చేరుకోవడానికి అంకితభావంతో, పట్టుదలతో చేసిన నిరంతర కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు. సభలో రోటరీ మాజీ గవర్నర్ రామలింగారెడ్డి, సూరన సారస్వత సంఘం అధ్యక్షుడు డాక్టర్ గెలివి సహదేవుడు, కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదనరావు, చిన్నయ్య సూరి సాహితీ సంస్థ అధ్యక్షులు డాక్టర్ రమణ మూర్తి, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాస్ రెడ్డి దస్తగిరి రెడ్డి సేవలను ప్రశంసించారు. ఈ అభినందన సభలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి, గురు రాజా కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ షావలి రెడ్డి, ఐ ఎమ్ ఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, రోటరీ మాజీ గవర్నర్ చిన్నప్పరెడ్డి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు రవీంద్రనాథ్,జోన్ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లా చైర్మన్ బైసాని రమేష్ ,నంద్యాల వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు ఎంపివి. రమణయ్య, నంద్యాల అనస్థీషియా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, భగవత్ సేవా సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు సూరయ్య, శ్రీనివాస్, బాలాజీ మర్చంట్స్ అసోసియేషన్ బాలాజీ కళ్యాణ మండపం అధ్యక్షులు కశేట్టీ కృష్ణమూర్తి, ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి , రెడ్డి సంఘం అధ్యక్షులు ఆర్ వి సుబ్బారెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు యరబోలు మహేశ్వర్ రెడ్డి, ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రమౌళీశ్వర రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహబూబ్ భాష, వైఎస్ఆర్ సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, పి.పి. మధుసూదన రెడ్డి, నెరవాటి సత్యనారాయణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లాలి స్వామి పట్టణ ప్రముఖులు, వైద్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, సంస్థల నిర్వాహకులు, సాంస్కృతిక, సాహిత్య సంస్థల ప్రతినిధులు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం తమ సంస్థల తరపున దస్తగిరి రెడ్డి ని శాలువాలు పూలమాలలు,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి వారి సేవలను అభినందించారు.