You are currently viewing ఈద్ మిలాప్ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన జమాఆతె ఇస్లామి

ఈద్ మిలాప్ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన జమాఆతె ఇస్లామి

  • Post category:Nandyal

ఈద్ మిలాప్ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన జమాఆతె ఇస్లామి

రమజాను మాసమంతా ఉపవాసం ఉన్న ముస్లీంలు ఖుషీగా ఈద్ నిర్వహిస్తారు. ఈ ఆనందం ఈద్ మిలాప్ నిర్వహించి దేశవాసులతో పంచుకుంటారు.ఈ నేపథ్యంలో జమాఆతె ఇస్లామీయ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ఆహ్వానం కరపత్రం విడుదల చేసారు. 7-5-22 శనివారం సాయంత్రం 7గం స్థానిక శ్రీ వివేకానంద ఆడిటోరియంలో (రామకృష్ణ డిగ్రీ కళాశాల వద్ద) ఈద్ మిలాప్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తుందని జమాతె‌ ఇస్లామి నంద్యాల అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ తెలిపారు. ఈ సమావేశానికి జమాఆతె ఇస్లామి రాష్ట్ర అధ్యక్షులు డా.ముహమ్మద్ రఫీక్ అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథులుగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎంఎల్సీ సి. ఇసాక్ బాషా  అతిథి వక్తలుగా ఈశ్వర స్వామి, శివశక్తి మఠం కర్నూలు, రామకృష్ణా రెడ్డి, ఛైర్మన్ రామకృష్ణ విద్యా సంస్థలు, రావినూతల దుర్గా ప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షులు బ్రాహ్మణ అపరకర్మల సంఘం, బ్రదర్ ఆనందం సుధాకర్ ఫాస్టర్,  సర్దార్ దర్శన్ సింగ్ కలార, సి.శ్యాంసుందర్ లాల్ కౌన్సిలర్, ఏపియూడబ్లుజే జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. మతాలకు అతీతంగా అందరు హాజరు కావాలని జమాత్ అందరిని ఆహ్వానిస్తుంది.