నంద్యాల: నంద్యాలలోని శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల యందు ఈనెల 26వ తేది గురువారం హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ హెటరో ఫార్మా లిమిటెడ్ వారు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుంది ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష, హెచ్.ఆర్ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఈ ఎంపికకు బిఎస్ సిలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా చదువుచున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు లేదా 2018 నుండి 2021లో బిఎస్ సి పూర్తి చేసిన వారు ఎం ఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ప్రాంగణ ఎంపికలో పాల్గొనవచ్చని అంతేకాక బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తయిన వారు లేదా ఫైనలియర్ విద్యార్థులు లేదా బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేదా పూర్తి చేసిన విద్యార్థులు ప్రాంగణ ఎంపికకు హాజరు కావచ్చని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ కె బీవీ సుబ్బయ్య తెలపడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలిసిందిగా నంద్యాల చుట్టుపక్కల ఉన్న అర్హత ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవలసిందిగా కోరడమైనది ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష, హెచ్ ఆర్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందని వివరించారు ఈ అవకాశం నిరుద్యోగ యువత ఉపయోగించుకుని అవకాశాన్ని పొందాలని అని ఆకాంక్షించారు సంస్థ చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి ఈ సందర్భంగా ప్రాంగణ ఎంపికకు హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హతకు సంబంధించిన జిరాక్స్ సర్టిఫికెట్లు, రెజ్యూమె తీసుకొని హాజరు కావలసిందిగా కోరడమైనది.
శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
- Post published:May 25, 2022
- Post category:Nandyal