You are currently viewing ఇళ్ల పట్టాలను త్వరితగతిన పంపిణీ చేయండి

ఇళ్ల పట్టాలను త్వరితగతిన పంపిణీ చేయండి

  • Post category:Nandyal

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకునేలా చర్యలు చేపట్టండి

ఇంకా ప్రారంభంకాని ఇళ్లు ఉంటే వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోండి

రీ సర్వే, భూసేకరణ పనులు వేగవంతం చేయండి

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

నంద్యాల: వైయస్సార్ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరు కోసం 78,045 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 66,907 మందిని అర్హులుగా గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని ఇంకా పెండింగ్ లో ఉన్న 12,186 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని మండల తాసిల్దార్ లను జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. బుధవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని(ఆర్.ఏ.ఆర్.ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్యతో కలిసి హౌస్ సైట్స్, ఓటిఎస్, హౌసింగ్, ల్యాండ్ లెవెలింగ్, రీ సర్వే, సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ తదితర అజెండా అంశాలపై అధికారులతో కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు శ్రీనివాసులు, వెంకట రెడ్డి, ఎంకె దాసు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ మండలాల్లో పెండింగులో వున్న 12,186 ఇళ్ల పట్టాల పంపిణీకి వెంటనే చర్యలు చేపట్టాలని మండల తహసీల్దార్లలను ఆదేశించారు. కోర్టు కేసులు, స్థల సమస్య వున్న వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమీక్షించాలని ఆర్డీఓలను ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథక ప్రగతిపై మండలాల వారీగా కలెక్టర్ ఆరా తీస్తూ ఇప్పటివరకు కేవలం 674 గృహాలు మాత్రమే పూర్తయ్యాయన్నారు. జిల్లాలో 45,767 ఇళ్లు మంజూరుకు గాను బిలో బేస్మెంట్ లెవెల్ 27,087, బేస్ మెంట్ లెవెల్ 5560, రూప్ లెవెల్ 1243, రూప్ కాస్ట్ లో 2073 ఇంకా ప్రారంభంకాని ఇల్లు 9130 ఉన్నాయని హౌసింగ్ అధికారులు గృహ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని విడనాడి చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓలు, మండల తాసిల్దార్ లు, ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించి ఇళ్ల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రతిరోజు సమీక్షిస్తూ పురోగతిని పెంచాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే నీటి సమస్య, ఇసుక, సిమెంట్ తదితర మెటీరియల్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని నిర్మాణాలు పూర్తి చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కలెక్టర్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులను ప్రోత్సహించి నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డిఆర్డిఎ ద్వారా 13252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు గాను 6019 మందికి రుణాలు మంజూరు చేశారని మిగిలిన లబ్ధిదారులకు కూడా కూడా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి ని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య లేదని అన్ని కాలనీలలో భూమిని చదును చేసి రహదారులు కూడా నిర్మించారని గృహాలు నిర్మించుకునేందుకు లబ్ధిదారులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. 490 జగనన్న లేఅవుట్ల కాలనీలలో భూమి చదునుకు సంబంధించి 509 పనులకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేశారని పెండింగ్లో ఉన్న 15 లక్షల రూపాయల పనులకు సంబంధించిన బిల్లులును కూడా అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సంబంధించి పెండింగ్ లేకుండా రిజిస్ట్రేషన్, స్కానింగ్ వంటివన్నీ పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే, సాగునీటి ప్రాజెక్టులు, రహదారి విస్తరణ పనులకు సంబంధించి భూసేకరణ ఏ ఏ మండలాల తహసీల్దార్ల వద్ద పెండింగ్ ఉందో వాటన్నింటినీ పూర్తి చేసి సంబంధిత ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.