కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ యువకుల నిరసన ర్యాలీ అదుపుతప్పి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈక్రమంలో నిరసనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పంటించారు. ఇంట్లోని మూడు కార్లను తగులబెట్టారు. విశ్వరూప్ ఆఫీసు ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వారి దాడితో ఇల్లు వదిలి పారిపోయారు. కాగా ఇప్పటివరకు మొత్తం 5 బస్సులకు నిరసనకారులు నిప్పంటించారు. నిరసనకారులు తాజాగా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి కూడా నిప్పంటించారు. మరోవైపు పోలీసులు నిరసనకారులను ఆదుపుచేసేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు.
