You are currently viewing గంగమ్మ జాతరలో పాల్గొన్న అధికార, ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు

గంగమ్మ జాతరలో పాల్గొన్న అధికార, ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు

  • Post category:Nandyal

గోస్పాడు: నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు గ్రామంలో పవిత్రంగా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గంగమ్మ జాతరను నిర్వహించుకున్న సందర్భంగా గోస్పాడు మండల వైసిపి నాయకులు మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని రైతు బంధువులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శిల్పా మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు జాతరలో వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎమ్ఎ.న్.డి.ఫరూక్, నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు పాల్గొన్నారు.