You are currently viewing వైసిపి ప్రభుత్వంలో అధిక ధరలకు విలవిలలాడుతున్న గడప గడప మాజీ ఎమ్మెల్యే భూమా

వైసిపి ప్రభుత్వంలో అధిక ధరలకు విలవిలలాడుతున్న గడప గడప మాజీ ఎమ్మెల్యే భూమా

  • Post category:Nandyal

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ప్రతి గడపలోని ప్రజలు అధిక ధరలతో విలవిల లాడుతున్నారని నంద్యాల మాజీ ఎం ఎల్ ఏ భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజల్ రేట్లు తగ్గించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడాన్ని నిరసిస్తూ నంద్యాల పట్టణంలో మాజీ ఎం ఎల్ ఏ భూమా అద్వెర్యలో తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ గతంలో పెట్రోలు డీజల్ రేట్లు కేంద్రప్రభుత్వం తగించకపోయిన తెలుగుదేశం ప్రభుత్వం పేదల ను దృష్టిలో పెట్టుకుని తగ్గించిందన్నారు. మూడేళ్ళ పాలనలో ఇసుక దొరక్క దినసరికూలీలకు పని దొరక్క ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని,నిత్వావసరాలు,విద్యుత్తు, ఆర్టీసి చార్జీలు పెంచి పేదవాడు బ్రతికే పరిస్థితి లేకుండా వైసిపి ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందన్నారు… సంక్షేమ పథకాల పేరుతో కేవలం 20 శాతం ప్రజలకు పథకాలు అందించి 80 శాతం ప్రజలపై మోయలేని భారాన్ని వైసిపి ప్రభుత్వం వేసిందన్నారు…ఇంతగా వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఒక్క చాన్స్ ముఖ్యమంత్రి గా జగన్ మిగిలి పోవడం ఖాయమని భూమా ధీమా వ్యక్తంచేశారు…2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని ప్రతి కార్యకర్త నేతలు తెలుగుదేశం గెలుపుకు కసితో కృషి చెయ్యాలని ఈసందర్భంగా భూమా ప్రజలకు నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, వార్డు ఇంచార్జీ లు, నంద్యాల మరియు గోస్పాడు మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.