మండల కేంద్రమైన రాచర్ల గ్రామానికి చెందిన పందిళ్ళపల్లె రాజేష్ నేషనల్ కబడ్డి చాంపియన్ లో పాల్గొన్న నేపద్యంగాను జూనియర్ కబడ్డి లీగ్ కు సెలెక్టు అయినందుకు గాను రాచర్ల గ్రామానికి చెందిన కండక్టర్ శంకర్ నాయుడు సహాకారంతోటి గిద్దలూరు జనసేనపార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు గారు ముఖ్య అథితిగా విచ్చేసి రాజేష్ కు 5000/- ఆర్ధిక సాయం అందించారు..ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యకర్తలు కాల్వ బాలరంగయ్య, లంకా నరసింహులు, రాచర్ల మండల నాయకులు వెంకటేశ్వర్లు, చలమయ్య , కంభం మండల నాయకులు వెంకటరావు,లంకా జనార్ధన్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబు, రాజేష్ కు ముందు ముందు కాలంలో చేయూత అందిస్తానని తెలియజేశారు.
