You are currently viewing నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి అక్రమాలు

నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి అక్రమాలు

  • Post category:Nandyal

అవినీతి అక్రమాలకు పాల్పడుతూన్న నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ విజయ్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ రంగనాయకులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ ని సస్పెండ్ చేయాలని అదే విధంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తిష్ట వేసి డ్రగ్ మాఫీయాకు పాల్పడుతున్న ఆంధ్ర,ఆదిత్య,కాత్యాయని మెడికల్ ఏజెన్సీ ల గుర్తింపును రద్దు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరుతూ నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం,రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి.రామచంద్రుడు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్.రియాజ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ, రాజు, రంగస్వామి, విద్యార్థి, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.