You are currently viewing అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

నిర్దేశించిన లక్ష్యాలను సాధించండి

జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ , డిఆర్వో మాలోల, డ్వామ, డిఆర్డీఏ, ఏపీఎంఐపి, మెప్మా పీడిలు యదుభూషణ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ రామమోహన్, అనుడ విసి శ్రీలక్ష్మి..లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ…. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్పందన పోర్టల్ ద్వారా.. ప్రజా సమస్యలను మరింత సులభతరంగా, నాణ్యతతో పరిష్కరించడంతో పాటు.. పరిష్కార నివేదికను కూడా సంబందిత పోర్టల్లో పొందుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు తమకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ఫలితాలను సాధించాలన్నారు. కొవిడ్ ప్రొటోకాల్ ను విధిగా పాటించాలి
ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోనందున … అధికారులు, వారి సిబ్బంది, ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ … తరచుగా సానిటైజర్ తో కానీ సబ్బుతో కానీ చేతులను శుభ్రం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అన్నారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు. స్పందన ద్వారా.. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంకు చెందిన కాలిపల్లి వెంకట రమణ… సోమశిల ముంపు పరిహారం క్రింద తనకు వచ్చిన భూమిని ఇతరులు అక్రమించారని.. విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని.. జిల్లా స్పందనలో అర్జీ సమర్పించారు. కడప నగరం చిన్నచౌక్, వేదపురం కాలనీకి చెందిన.. వివి ప్రసాద్, వీధి ప్రజలు.. తమ వీధిలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా రోడ్లు, డ్రైనేజీ… ఎన్ క్రోచ్మెంట్ చేపట్టడం జరిగింది. ఇది వీధి ప్రజలకు ఇబ్బందిగా మారిందని.. సమస్యను పరిష్కరించాలని జిల్లా స్పందనలో వినతిపత్రం సమర్పించారు. వల్లూరు మండలం, కొప్పోలుకు చెందిన ఆర్. ఉత్తయ్య.. వికలాంగుడు అయిన తనకు.. ట్రై సైకిల్ మంజూరు చేయవలసిందిగా.. జిల్లా స్పందనలో వినతిపత్రం సమర్పించారు. సి.కె.దిన్నె మండలం, బలిజపల్లికి చెందిన రెడ్డి వరప్రసాద్.. తన అబ్బ పేరుతో ఉన్న.. సర్వే.నెం. 556/2 సర్వే నెంబర్ లోని 5 సెంట్ల భూమిని తనపేరుతో.. ఆన్ లైన్ చేయించాలని.. కోరుతూ స్పందనలో జిల్లా కలెక్టర్ కు అర్జీని సమర్పించారు. కొండాపురం మండలం.. వెంకయ్య కాలనీకి చెందిన.. వెంకట ఫకీరప్ప.. మా భూమిని పట్టా చేయించమని అడిగితే.. డబ్బులు అడుగుతున్నారని.. తమ భూమిని ఆన్ లైన్ లో రికార్డు చేయించాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష పీడి ప్రభాకర రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.నాగరాజు, ఎల్డిఎం దుర్గా ప్రసాద్, రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.వెంకటేశ్వర రావు, గృహనిర్మాణ శాఖ పీడి కృష్ణయ్య, ఎస్ సి కార్పొరేషన్ ఈడి వెంకట సుబ్బయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి బ్రహ్మయ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి, ఉద్యానశాఖ డిడి వజ్రశ్రీ, గ్రౌండ్ వాటర్ డిడి మురళి, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.