You are currently viewing ప్రమాదవశాత్తు వెన్నెముక దెబ్బతిన్న ఫిరోజ్ ఖాన్ మెరుగైన చికిత్స కోసం దాతలు ఆర్థిక సహాయం అందించాలి

ప్రమాదవశాత్తు వెన్నెముక దెబ్బతిన్న ఫిరోజ్ ఖాన్ మెరుగైన చికిత్స కోసం దాతలు ఆర్థిక సహాయం అందించాలి

  • Post category:Nandyal

నంద్యాల వైఎస్ఆర్ నగర్ లో నివాసం ఉన్న ఫిరోజ్ ఖాన్ తన ఉపాధి కోసం గౌండ పని చేసుకుంటూ తన భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవాడు. ప్రమాదవశాత్తు ఇంటి నిర్మాణంలో రెండవ అంతస్తు నుండి కిందపడి వెన్నెముక దెబ్బతిని తన నడుము నుండి కాళ్ళ వరకు చలనం లేక స్పర్శ తెలియక కాళ్లకు పుండ్లు ఏర్పడి అనారోగ్యంతో మంచానికి అంకితమయ్యాడు. ఫిరోజ్ ఖాన్ కు ఆపరేషన్ చేయడం ద్వారా తన మెరుగైన చికిత్స మరియు ఫిజియోథెరపీ చేయడం వలన తన రెండు కాళ్ళు తిరిగి నడవగలిగే స్థితికి వస్తాడని ప్రతి నెల 20000/- రూపాయలు ఖర్చు అవుతుందని తన భార్య సబీరా ఖాతు దాతలకు మీ వంతు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటుంది. ఫిరోజ్ ఖాన్ పరిస్థితి చూసి ప్రస్తుతానికి మెడిసిన్స్ కు నంద్యాలలోని నివాసమున్న సి.ఉమార్ భాష తన వంతు ఆర్థిక సహాయం అందించారు. ఫిరోజ్ ఖాన్ మెరుగైన చికిత్సకు, మెడిసిన్స్ కు మరియు ఫిజియోథెరపీ కి దాతలు ముందుకు వచ్చి మీ వంతు ఆర్థిక సహాయం అందించాలని మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి, సభ్యుడు హుస్సేన్ వలి దాతలను కోరుకుంటున్నారు.