నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహణలో, హైదరాబాద్ ఏ ఐ జి ఆసుపత్రి సహకారంతో స్థానిక మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన నిరంతర వైద్యవిద్య సదస్సులో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కళ్యాణ్, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ చైతన్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదడులో ఏర్పడే కణుతులు, వెన్నెముక సమస్యలు సరైన సమయంలో ప్రాథమిక దశలో గుర్తిస్తే నూతనంగా రూపొందించబడిన ఆధునిక పరికరాల సహాయంతో సరైన శస్త్రచికిత్స, వైద్య చికిత్సల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. మెదడులో వెన్నెముకలు సమస్యలు గుర్తించే అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు, రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఎఐజి ఆసుపత్రిలో మెదడు శస్త్రచికిత్సల కోసం ప్రపంచంలోనే అత్యాధునికమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ,నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అనిల్, డాక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి సదస్సులో పాల్గొన్న వక్తలను జ్ఞాపికలతో సత్కరించారు.
