You are currently viewing గిరిజనులకు జగన్ సర్కార్ పట్టాభిషేకం అమోఘం

గిరిజనులకు జగన్ సర్కార్ పట్టాభిషేకం అమోఘం

  • Post category:Nandyal

సాగుచేస్తున్న భూములపై అడవి బిడ్డలకు సర్కార్ హక్కు

అటవీ హక్కుల చట్టం అమలులో ఏపీ నెంబర్ వన్

సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం

-ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

గిరి పుత్రులకు పట్టాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని, ఈ మూడేళ్ల కాలంలో 1.33.342 మందికి 2.47.585 ఎకరాల భూమికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను పంపిణీ చేసి వైసిపి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని ఆంధ్ర ప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నంద్యాల జిల్లాలోని తన జిపిఎస్ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్రానికి ముందు నుంచే గిరిజనులు అటవీ ప్రాంతంలోని భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే వారిని బ్రిటిష్ ప్రభుత్వం రక్షిత అటవీ ప్రాంతం అనే పేరుతో 18 వ శతాబ్దంలో వ్యవసాయాన్ని రద్దు చేసిందని, పోడు వ్యవసాయం చేసే వారిపై బ్రిటీషువారు దురాగతాలకు పాల్పడేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న గిరిజన అడవి బిడ్డలకు అల్లూరి సీతారామరాజు అండగా నిలిచారు. తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకునే అటవీ భూములపై వారికి ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి. అటవీ అధికారులు సైతం పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల పై కేసులు పెట్టి పంటలను ధ్వంసం చేసిన సందర్భాలున్నాయని మరొక్కసారి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనులకు పట్టాల పంపిణీ ఉన్న అడ్డంకులను తొలగించి వారికి హక్కు కల్పించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని, దీనికి రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల కష్టాలను తన పాదయాత్రలో తెలుసుకున్న వైయస్సార్ అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి 2006లో దేశ వ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) అమల్లోకి తేవడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ఆ చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకుని గిరిజనులకు వ్యక్తిగతంగానూ సామాజికంగానూ అటవీ భూములపై హక్కు కల్పించే కార్యక్రమానికి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టడం అద్భుతమైన అటవీ హక్కుల చట్టం అమలులో ఏపీ నెంబర్ వన్ అని జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు.