You are currently viewing రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి

  • Post category:Anantapur

ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారి కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ప్రకాష్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శలకు దిగారు అని ఆయన్ని అడ్రస్ చేస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురించి మరియు జనసేన పార్టీ గురించి విమర్శలు చేయడం మీ వ్యక్తిగత అధికార ధ్రుహకారా నైజానికి నిదర్శనం….. జనసేన పార్టీకి దశా దిశా లేదు సిద్ధాంతం లేదు అని మాట్లాడుతున్న మీరు చంచల్గూడా షటిల్ టీం ముఠా సభ్యులైన మీకు, మీ నాయకుడు సి.బి.ఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డికి దిశా దశ ఉందా? మీ పార్టీకి సిద్ధాంతం ఉందా?
మీ నాయకుడు నైజమే ఉన్మాదం, మీ నైజమే అహంకారం, మీ నైజమే దోచుకోవడం దాచుకోవడం మీకంటే బందిపోట్లు రాబందులు మేలు?
గత నెల జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనంతపురం జిల్లాకు విచ్చేసి దాదాపు 33 మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని పరామర్శించి, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని నింపి తనవంతు సాయంగా, వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వం మీరు చేయలేని పనిని తన సొంత నిధులు వెచ్చించి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. మరీ ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో మన్నీల గ్రామంలో గ్రామంలో ముగ్గురు రైతు కుటుంబాలకు పూలకుంటలో ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆదుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చే మునుపటి రోజు 11 తేదీ ఆగ మేఘాల పైన ఆత్మహత్య చేసుకున్న పూలకుంట రైతు చిన్న గంగయ్య భార్య అరుణమ్మ Ac.31392210019175 లక్ష రూపాయలు, పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చిన రోజు 12తేదీన ప్రభుత్వం 6 లక్ష రూపాయలు వేయడం నిజమా అబద్దమా. మన్నీల గ్రామంలో వడ్డే అంజనేయులు భార్య రామాంజి నమ్మ సిండికేట్ బ్యాంక్ అకౌంట్, టవర్ క్లాక్ బ్రాంచ్ అనంతపురం 31202010027131, 11/4/2022 తారీకున లక్ష రూపాయలు 12 వ తారీఖున ఆరు లక్షల రూపాయలు, P.తిమ్మా చారి భార్య లక్ష్మి కెనరా బ్యాంకు క్లాక్ టవర్ బ్రాంచ్ AC.No.31202010019545 అకౌంట్ ముందు లక్ష రూపాయలు వేసి ఇంతవరకు మిగతా ఆరు లక్షలు ఇవ్వలేదు, అదేవిధంగా మన్నీల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఆదినారాయణ భార్య అకౌంట్ లో 11 వ తారీకున లక్ష రూపాయలు వేసి ఇంతవరకూ మిగిలిన ఆరు లక్షల రూపాయలు ఇవ్వలేదు ఇది నిజమా అబద్దమా?… నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రమ్మని ఆహ్వానిస్తున్నాం. రాప్తాడు నియోజకవర్గంలో ఈ రెండు గ్రామాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ రోజు వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సహాయం చేస్తే ఓర్చుకోలేక చాతకాక పిచ్చి ప్రేలాపనలు వెళుతున్నావ్…. ఇటుకల పల్లి పోలీస్ స్టేషన్లో ఈ నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఎఫ్.ఐ.ఆర్ నమోదైన మాట వాస్తవం కాదా… రాప్తాడు నియోజకవర్గంలో ఈ మూడేళ్లలో ఎమ్మెల్యేగా గెలిచి ఏమీ అభివృద్ధి సాధించావు… బయట ప్రజలు మీ ఇంట్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అని అనుకుంటున్నారు నిజమా అబద్దమా?… ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి పట్ల జాగ్రత్తగా మాట్లాడు లేదంటే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాం.