You are currently viewing పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం

  • Post category:Nandyal

ఏడుగురు నిందితులు అరెస్ట్ , పరారీలో ముగ్గురు.

అటవీశాఖ రుద్రవరం రేంజ్ పరిధిలోని డి వనిపెంట సెక్షన్ ముత్యాలపాడు బీట్ ప్రాంతంలో పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని ముగ్గురు పరారీలో ఉన్నారని రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. స్థానిక అటవీ కార్యాలయం వద్ద డీఎఫ్వో వినీత్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం  పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో పాటు నిందితులను చూపించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి తెలిపిన వివరాల మేరకు కొందరు వ్యక్తులు అటవీ శాఖ ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో నుండి ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి రుద్రవరం రేంజ్ పరిధిలోని డి వనిపెంట సెక్షన్ ముత్యాలపాడు బీటు లో గల ముచ్చుకుంట ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను భుజం మోతగా ఎత్తుకెళ్తున్న నిందితులపై దాడి చేశామన్నారు. ఈ దాడిలో 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రామశెట్టి ప్రసాదు, జె ప్రసాదు, ఆలమూరు గ్రామానికి చెందిన చాకలి శివ రాముడు, ఏ పెద్దనరసింహుడు, మిట్టపల్లె గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీనరసింహుడు, చాకలి లక్ష్మీనరసింహుడు, చాకలి నరసింహులు అనే నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామన్నారు. మన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలను రుద్రవరం అటవీ కార్యాలయం తరలించి నిందితులపై కేసు నమోదు చేశామని రేంజ్ అధికారి తెలిపారు. ఈ దాడిలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.