పట్టణంలోని ఎసీవోస్ కాలనీ నందలి శ్రీ గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఫౌండర్, చైర్మన్ పెద్దిరెడ్డ దగిరిరెడ్డికి గౌరవ డాక్టరేట్ను శనివారం అందచేస్తున్నారు. కర్నూల్ నందలి రాయలసీమ యూనివర్శిటీ నుండి ఇస్తున్న డాక్టరేట్ను గవర్నర్ విశ్వభూషన్ చేతుల మీదుగా శనివారం యూనివర్శిటీలో జరిగే కార్యక్రమంలో దస్తగిరి రెడ్డి స్వీకరించనున్నారు. గురురాజ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నుండి ఇప్పటి వరకు దాదాపు 38 వేల మంది బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు పొందారు. రాయలసీమ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్ లభించడం ఎంతో సంతోషకరమని పట్టణంలో ప్రముఖులు ఈ సందర్భంగా దస్తగిరిరెడ్డికి అభినందనలు తెలిపారు.
దస్తగిరిరెడ్డికి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలి -డా. జి రవికృష్ణ
రాయలసీమ యూనివర్శిటీ నుండి దస్తగిరి రెడ్డికి డాక్టరేట్ ఇవ్వడం జిల్లా అందరికి ఎంతో సంతోషకరమని కళారాధన ప్రధాన కార్యదర్శి, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డా.జి రవికృష్ణ పేర్కోన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆయన చేసిన కృషికి, ట్రస్ట్ ద్వారా స్వగ్రామంలో, పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కావున రాష్ట్రప్రభుత్వం గుర్తించి దస్తగిరిరెడ్డికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించాలని కోరారు.