You are currently viewing ఉప ముఖ్యమంత్రి మీరైనా స్పందించండి

ఉప ముఖ్యమంత్రి మీరైనా స్పందించండి

  • Post category:Nandyal

గతంలో ఇచ్చిన వినతిపత్రాలకు దిక్కులేదు

-గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

శ్రీశైలంలో గిరిజనులకు సత్రం కోసం స్థలం కేటాయించాలి

నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రిని కోరిన జిపిఎస్ నాయకులు

రాష్ట్రంలో ఎస్టీల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి షేక్ అంజాద్ బాషాకు గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు వినతి పత్రం సమర్పించారు. శ్రీశైలంలో గిరిజనులకు అన్నదాన సత్రం కొరకు స్థలం కావాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని తెలిపారు. గతంలో వినతి పత్రాల గురించి స్పందన లేదని కనీసం మీరైనా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో గిరిజనులకు సత్రానికి స్థలం కేటాయిస్తే తాము భవనాన్ని నిర్మించుకుంటామన్నారు. గిరిజనులకు ఆరాధ్యదైవమైన శ్రీశైలంలో ఇంతవరకు వసతిగృహం లేకపోవడం విచారకరమన్నారు. మహాశివరాత్రి వంటి పండుగ దినాల్లో ఎక్కడో చెట్ల కింద తల దాచుకోవాల్సిన దౌర్భాగ్యం గిరిజనులకు కలిగిస్తుందని ఇన్చార్జి మంత్రిని కోరారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గిరిజనులకు స్థలం కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, యూత్ యువజన నాయకుడు స్వామి నాయక్, విక్రమ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.