ఈ నెల 28న విభిన్న ప్రతిభావంతులకు సహాయ పరికరాల పంపిణీ

  • Post category:Nandyal

నంద్యాల వ్యవసాయం, మే 18, (ప్రభన్యూస్): ఈ నెల 28న నంద్యాల జిల్లా కేంద్రంలో ఆ ప్రాంత ఎంపికైన విభిన్న ప్రతిభావంతులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు. హిజ్రాల వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పి.విజయ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు. నంద్యాల నియోజకవర్గాలలలోని విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులు) వివిధ సహాయ పరికరాల లబ్దిదారుల కొరకై ఎంపిక శిబిరం ను 2019 సంవత్సరం నవంబర్ 27 నుండి 29 వరకు విభిన్న ప్రతిభావంతులు. హిజ్రాల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలీంకో కాన్పూరు వారి సౌజన్యంతో ఎంపిక శిబిరంను నిర్వహించడం. జరిగిందని అందులో ఎంపికైన లబ్దిదారులకు పరికరాలు ఇస్తున్నామన్నారు. కాపున ఆత్మకూరు నంద్యాల నియోజక వర్గములలోని పై కార్యక్రమమమునకు హాజరైన దివ్యాంగులు ఈ నెల 28వ తేదీన ఉదయం 10.00 గంటలకు నంద్యాల జిల్లా నూనెపల్లి వద్ద ఉన్న శ్రీ భారతీ సీడ్స్ గోడౌన్ నందు దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్, మూడు చక్రాల సైకిల్, వీల్చైరై చేతికర్రలు వివిధ సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు ముఖ్య తిధులుగా పాల్గొంటారన్నారు. ఇతర ప్రజా ప్రతినిధులు. ఇతర జిల్లా అధికారులు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని విజయ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ నెల 28వ తేదీన ఉదయం 10.00 గంటలకు పైన పేర్కొన్న రెండు తేదీల యందు హజరై ఎంపికైన వారు ఆలీంకో కాన్పూరు వారు జారీ చేసిన రశీదుతో పాటు వారి ఆధార్ కార్డు. మెడికల్స ర్టిఫికెట్(సదరం) నకలు కాపీలతోపాటు రెండు పాస్ప్సోర్టజ్ ఫోటోలతో సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమ సభకు హాజరు కావలసినదిగా తెలిపారు.