You are currently viewing సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప ముంపు గ్రామాల

సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప ముంపు గ్రామాల

  • Post category:Nandyal

నిరుపేదలను ఆదుకోండని నంద్యాల జిల్లా ఎస్.పికి బైరెడ్డి వినతి

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప గ్రామాల్లో రైతులను, చెంచు గిరిజనులను, నిరుపేదలను కొందరు అధికార దాహంతో తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని వారినుండి నిరుపేదలకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోరారు. బుధవారం నంద్యాల జిల్లా ఎస్. పి. రఘువీరారెడ్డికి బైరెడ్డి రాజశేఖరరెడ్డి బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగు అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు క్రింద సర్వం త్యాగం చేసిన వందలాది కుటుంబాలు నేటికీ నల్లమల అడవిలో ఎత్తు పల్లాల్లో పూరి గుడిచెల్లో చిమ్మ చీకటి అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. శ్రీశైలం రిజర్వాయర్ ముంపుకు గురై 1980 సంవత్సరంలోనే కట్టుబట్టలతో ఊళ్లు వదలి ఆ గ్రామాల సమీపంలో ని ఎత్త యినా అడవిలోనే అన్ని కష్టాలు అనుభవిస్తూ 42 ఏళ్ళు గా చీకటి లోనే తల దాసుకుంటున్నారని, ఏ చిన్న ఆపద కుటుంబంలో వచ్చిన రోడ్డు లేని అడవి లో కిలోమీటర్లు కాలినడక వెళ్లాల్సి వస్తుంద ని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి నుండి నేటి వరకు శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు ఉన్నప్పుడు చేపల వేట, రిజర్వాయర్ లో నీరు తగ్గినప్పుడు ఆ పొలాల్లోనే ఆరుతడి పంటలు జొన్న, కంది, పెసలు, మినుములు, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారని వివరించారు.1980 వ సంవత్సరం నుండి 2016 వరకు ఎలాంటి సమస్య లేని ఈ గ్రామాల నిరుపేదలకు కొందరు అధికారం అడ్డం పెట్టుకొని గ్రామాలు వదిలి వెళ్లి ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ వారి పొలాలు సాగు చేయవద్దని 2017 నుంచి అనేక కష్టాలు పెడుతున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని జిల్లా ఎస్. పి దృష్టికి బైరెడ్డి తెచ్చారు. రిజర్వాయర్ లో నీరు లేక చేపలు పట్టుకోలేక, భూమి సాగు చేసులేక పేదలు ఆకలితో అలమటిస్తూ అడవి పలసాయంతో కడుపు నింపుకొని కాలం వెళ్ళాదిస్తూన్నారని వివరించారు. ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థ ల ద్వారా సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప గ్రామాల్లో కొందరికి పక్కా గృహాలు కూడా నిర్మించినదని, రేషన్ కార్డులు, ఆధార్ కార్డు లు, ఓటర్ కార్డు లు కూడా ఇచ్చిందని ఆయన వివరించారు.అధికార పార్టీ వారి ఆగాడాలకు అడ్డుకట్టవేసి భూమిని, గ్రామాలను నమ్ముకున్న నిరుపేదలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్. పి లు రక్షణ కల్పించి భూమి సాగుకు అవకాశం కల్పించాలని బైరెడ్డి కోరారు. పూర్తి వివరాలు సేకరించి భాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్. పి రఘు వీరారెడ్డి భాధితులకు హామీ ఇచ్చారు. అనంతరం భాధితులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో జానాలగూడెం గట్టుమీద వెంకటేశ్వర్లు, పి. బయ్యాన్న పెరుమాళ్ళ తిక్కస్వామీ, మిరపం చెంచు బాలమ్మ, ఊరతనూరు తిక్కస్వామి, లక్ష్మయ్య, బలపాలతిప్ప వాసు లు జి. నారాయణ, మౌలాలి, సంఘం తిక్కస్వామీ, దుర్గం పెద్ద పుల్లయ్య, పి. నారాయణ, పి. బయ్యాన్న, శ్రీనువాసలు, ఈశ్వరయ్య, నరసింహ, వెంకటేష్ తదితర భాధితులు జిల్లా ఎస్. పి. జిల్లా కలెక్టర్ లను కలిసి వినతి పత్రాలు అందజేశారు.