You are currently viewing రాజ్యసభ సీటు ముస్లిం మైనార్టీకి ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్

రాజ్యసభ సీటు ముస్లిం మైనార్టీకి ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్

  • Post category:Nandyal

ఈ సందర్భంగా అవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు రఫీ, ఐఎఫ్టియు డివిజన్ అధ్యక్షులు షేక్ మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీటును ముస్లిం మైనారిటీకి ఇస్తానని చెప్పి నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం ప్రజలకు మొండిచేయి చూపించడం జరిగింది. దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం మైనార్టీల పైన జరుగుతున్న దాడులు పైన ప్రశ్నించడానికి రాజ్యసభలో మైనారిటీలకు ఇవ్వకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్ర ప్రజలకు మాట తప్పం మడమ తిప్పం మోసం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ ప్రజలు ఓట్లు జగన్ గెలిచి నేడు రాజ్యసభలో ముస్లిం సమస్యలపైన గళం విప్పే నాయకుడు లేకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముస్లింల ద్రోహి అని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మీద రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని వారు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మీద ప్రతి ఒక్కరు రావాలని వారు పిలుపునిచ్చారు.