You are currently viewing నాటుసారా బట్టీలు ధ్వంసం

నాటుసారా బట్టీలు ధ్వంసం

  • Post category:Nandyal

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆదేశాలమేరకు జిల్లాలో ఆదివారం జిల్లా పోలీసులు ఎస్.ఈ.బి వారితో కలిసి నాటుసారా స్థావరాలపై దాడి చేసి 33 మందిని అరెస్ట్ చేసి 15 కేసులు నమోదు చేసినారు. 506 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని 9400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంశం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 250 కే.జిల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. పేదవారికి అందవలసిన పి. డి. ఎస్ రైస్ ని కొంతమంది వ్యక్తులు అక్రమంగా రవాణా చేయుచుండగా వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి పి. డి. ఎస్ రైస్ ని స్వాధీనం చేసుకున్నారు. వాటి వివరాలు 3 కేసులలో 7 మందిని అరెస్ట్ చేసి 1560 కే.జిల పి. డి. ఎస్ రైస్ ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎవరైనా నాటుసారా తయారుచేసిన, అమ్మిన ,రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పి. డి. ఎస్ రైస్ ని అక్రమంగా రవాణా చేసిన, అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.