You are currently viewing జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు 59 ఫిర్యాదులు

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు 59 ఫిర్యాదులు

  • Post category:Nandyal

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్దగల పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 59 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజల సమస్యలను జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి విని ప్రతి ఫిర్యాదిదారునితో నేరుగా మాట్లాడారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేశారు. దూర ప్రాంతాల నుండి పోలీస్ ఉన్నతాధికారులకు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజల ఆకలిని తీర్చడానికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. రైతుల భూములు ఎస్.సి కార్పోరేషన్ ద్వారా కొని ఎస్.సి కులం వారికి ఇస్తామని పోతుల.ప్రసాద్ బాబు 9 లక్షలు తీసుకొని మోసం చేసినాడని ముక్కమల్ల గ్రామానికి చెందిన వెంకటయ్య ఫిర్యాదు చేశారు. బుక్కపురం గ్రామానికి చెందిన అరటి గెలల వ్యాపారం వలన జీవనం చేస్తున్న బాలుడుని వీర నాగబాబు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసినాడు అని కె.పి.బాలుడు ఫిర్యాదు చేశారు. భర్త చనిపోయిన తరువాత తన ఇద్దరు కుమారులు తనని కొట్టి రెండు ఎకరాల పొలం అగ్రిమెంట్ వ్రాయించుకొని బయటకు తరిమి వేశారని పట్ల నారాయణమ్మ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ఎస్. బి సి.ఐ ప్రభాకర్ రెడ్డి, సి.ఐ జయరాములు పాల్గొన్నారు.