వైయస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి
-ఐ.ఎఫ్.టి.యూ నంద్యాల డివిజన్ అధ్యక్షులు షేక్ .మహమ్మద్
ఐ.ఎఫ్.టి.యూ నంద్యాల డివిజన్ అధ్యక్షులు షేక్ .మహమ్మద్ మాట్లాడుతూ వై ఎస్ఆర్ సి పి ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన అన్నారు గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీ మహిళలకు దుల్హన్ పథకం కింద పెళ్లి కానుకగా 50 వేల రూపాయలు ఇస్తుండేది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వైయస్సార్ దులహన్ పథకం కింద ప్రతి ముస్లిం అక్క,చెల్లెమ్మలకు లక్ష రూపాయలు పెళ్లిరోజు తమ బ్యాంకు ఖాతాలో జమ వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నమ్మి తీరా ముస్లిం మహిళలు నమ్మి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తే తీరా అధికారంలోకి వచ్చాక లక్ష రూపాయలు ఇవ్వడం ఏమోగాని గతంలో ఉన్న 50 వేల రూపాయలు కూడా ఇవ్వకుండా ముస్లిం మహిళలకు ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటిన ఈ పథకం అమలు చేయడంలో విఫలమైంది ఆయన అన్నారు ముస్లిం మైనారిటీ ప్రజలకు ఏ ఒక్క పథకం అమలు కాని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులతో ముస్లిం మైనార్టీలకు చెందిన అమ్మాయిలు వివాహం కానీ ఎంతో మంది యువతులు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒక ప్రొద్దుటూరు మండలంలొనే ఇప్పటివరకు మూడు వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం జిల్లా ,రాష్ట్ర వ్యాప్తంగా వున్న ముస్లిం మైనారిటీ యువతులకు రావలసిన డబ్బును జమచేయాలా కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వైయస్సార్ దులహన్ పథకం అమలు చేసి వెంటనే ఈ పథకానికి నిధులు కేటాయించిన దరఖాస్తు పెట్టుకున్నా ప్రతి ముస్లిం మైనార్టీ యువతుల వివాహాలకు రావలసిన లక్ష రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు. లేనిపక్షంలో ఇఫ్టు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యూ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్, ఉపాధ్యక్షులు గంటలు మాభాష , సహాయ కార్యదర్శి ఇమ్రాన్, సలాం, షేక్ మహబూబ్ బాషా, రవి, హరి, వంశీ, వినయ్, తదితరులు పాల్గొన్నారు.