You are currently viewing జిల్లాలోని 2,09,381 మంది రైతుల ఖాతాల్లో రూ. 115.25 కోట్లు జమ

జిల్లాలోని 2,09,381 మంది రైతుల ఖాతాల్లో రూ. 115.25 కోట్లు జమ

  • Post category:Nandyal

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం పెట్టుబడి సాయం కింద జిల్లాలోని 2,09,381 మంది రైతుల ఖాతాల్లో రూ. 115.25 కోట్లు జమ చేసామని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ టౌన్ హాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు జిల్లాలోని గణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2022–23 ఆర్థిక సంవత్సరానికి నాలుగో విడత రైతు భరోసా పథకం కింద 50.10 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా  బటన్‌ నొక్కి రూ3,758 కోట్లు జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా వ్యవ వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, మార్కుఫెడ్ చైర్మన్ పి.పి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేఖరులతో జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ కు ముందే నాలుగో విడత రైతు భరోసా పెట్టుబడి సాయం కింద జిల్లాలోని 2,09,381 మంది రైతుల ఖాతాల్లో రూ. 115.25 కోట్లు జమ చేసిందన్నారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ. 13,500 ప్రభుత్వం సాయంగా అందిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఎంపికైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడతగా 7,500 రూపాయలు జమ చేసామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 43 వేల 272 మంది రైతు కుటుంబాలకు 23.80 కోట్ల రూపాయలు, బనగానపల్లి నియోజకవర్గంలో 40 వేల 147 మంది రైతులకు 22.09 కోట్లు, డోన్ నియోజకవర్గంలో 34 వేల 822 మంది రైతులకు 19.16 కోట్లు, నందికొట్కూరు నియోజకవర్గంలో 37 వేల 770 మంది రైతులకు 20.78 కోట్లు, నంద్యాల నియోజకవర్గంలో 13 వేల 784 మంది రైతులకు 7.5 కోట్లు, పాణ్యం నియోజకవర్గంలో 13 వేల 8377 మంది రైతులకు 7.6 కోట్లు, శ్రీశైలం నియోజకవర్గంలో 25 వేల 747 మంది రైతులకు 14.21 కోట్లు వెరసి మొత్తం 2,09,381 మంది రైతుల ఖాతాల్లో రూ. 115.25 కోట్లు జమ చేసామని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేసి రైతులకు పురుగులేని మందులు, రసాయనిక ఎరువులు, నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవ వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల శివరామిరెడ్డి మాట్లాడుతూ రైతుల బాగు కోసం ప్రతి ఏడాది మే మాసంలో భూమిని నమ్ముకున్న ప్రతి రైతుకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందిస్తుందన్నారు. అంతకుముందు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను, వ్యవసాయ యంత్ర పనిముట్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, ఉద్యాన శాఖాధికారి రమణయ్య, ఇతర వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.