You are currently viewing రాష్ట్రస్థాయి పతకాలు సాధించిన నంద్యాల కుస్తీ క్రీడాకారులు

రాష్ట్రస్థాయి పతకాలు సాధించిన నంద్యాల కుస్తీ క్రీడాకారులు

  • Post category:Nandyal

ఆంధ్ర ప్రదేశ్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘం నిర్వహణలో, మైలవరం పట్టణంలో అర్. బి. క్రీడా అకాడెమీ ప్రాంగణంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి 15 సంవత్సరాల లోపు కుస్తీ పోటీలలో పాల్గొనడానికి నంద్యాల వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ క్రీడాకారులు తొమ్మిది మంది ఎంపిక కాగా ముగ్గురు రాష్ట్రస్థాయి పతకాలు సాధించారు. వివిధ వెయిట్ కేటగిరీలలో, ఫ్రీ స్టైల్ విభాగంలో కాశీ విశ్వనాథ్ రజత పతకం సాధించగా, సాహితి, మణికంఠ కాంస్య పతకాలు సాధించారు.పతకాలు సాధించిన వారిని, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్న వంశీకృష్ణ, రఘు వర్ధన్, చేతన్,మౌనిక, హర్షిని, లిఖిత లను, వీరికి
శిక్షణ ఇచ్చిన కోచ్ వెంకట శివ లను నంద్యాల క్రీడా సమాఖ్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐఎమ్ఏ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అభినందించారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వీరిని ప్రోత్సహిస్తున్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరం కరస్పాండెంట్ వెంకట్ రాముడు,టీం మేనేజర్ రాజేశ్వరి, ఇంచార్జ్ బాలవర్ధి రాజుల కృషి ప్రశంసనీయమన్నారు. బాలికలు కుస్తీ పోటీల లో ఆసక్తి చూపటం అభినందనీయమన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలలో కూడా విజయం సాధించి రాష్ట్రానికి నంద్యాల కు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. నంద్యాలలో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను గతంలో నిర్వహించామని, భవిష్యత్తులో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.