You are currently viewing బెల్లం అక్రమ విక్రయాల పై కఠిన చర్యలు -జిల్లా ఎస్పీ

బెల్లం అక్రమ విక్రయాల పై కఠిన చర్యలు -జిల్లా ఎస్పీ

  • Post category:Nandyal

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి శనివారం బొమ్మలసత్రం వద్ద గల జిల్లా ఎస్పీ కార్యాలయంలో నంద్యాల జిల్లాలోని బెల్లం అమ్మే హోల్ సెల్ వ్యాపారస్తులతో మాట్లాడి వారికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బెల్లం అమ్మలని అలా చేయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నాటుసారా నిర్ములనకు జిల్లాలోని బెల్లం వ్యాపారస్తులు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. బెల్లం అమ్మే వ్యాపారులు అనగా హోల్ సెల్ వ్యాపారస్తులు, రిటైల్ వ్యాపారస్తులు బెల్లం ఎక్కడి నుండి తెస్తున్నారు, ఎవరికి అధిక మొత్తంలో అమ్ముతున్నారు అనే వారి పేరు మొదలగు వివరాలు వాటికి సంబంధించిన రికార్డులు జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన సూచనలను పాటిస్తూ ఎవరైనా సారా తయారీ కొరకు బెల్లం కొంటున్నారని అనుమానం వస్తే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ కోరారు.