ఎన్నో వేల మంది నిరుద్యోగులకు దస్తగిరి రెడ్డి, మౌలాలీ రెడ్డిల ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంలో శిక్షణ ఇచ్చి వారిని బ్యాంక్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నంద్యాలలో ఉండటం గర్వకారణమని ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎకైవోస్ కాలనీలోని గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నందు శనివారం 34వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశంలోనే బ్యాంకింగ్ శిక్షణలో ఎంతో పేరు పొందిన ఈ కోచింగ్ సెంటర్‌లో కోవిడ్ విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వం తరుపున ఒరిస్సా, కర్ణాటక, తెలంగాణాలకు వివిధ వాహనాలు మాత్రమే కాకుండా ఆర్టీసి బస్సులు ఒక్కొక్క రాష్ట్రానికి 16 పంపినట్లు తెలిపారు.
దస్తగిరి రెడ్డికి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలి -డా. జి.రవికృష్ణ
ఇప్పటి వరకు 37 వేల మందికి పైగా బ్యాంక్ ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దిన ఫౌండర్ దస్తగిరి రెడ్డికి ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించాలని ఐఎమ్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. జి.రవికృష్ణ పేర్కోన్నారు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఉద్యోగం వచ్చేంత వరకు కోచింగ్ ఇచ్చే సంస్థ గురురాజ కోచింగ్ సెంటర్ మాత్రమే అన్నారు. ప్రభుత్వం నిర్వహించే నందినాటకోత్సవాలలో రాష్ట్రంలో, దేశంలోనే వరుసగా 7 సార్లు నంది బహుమతి సాధించిన ఘనత షేక్షా వలి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దేనని అన్నారు.
ఐదు మందితో మొదలైన ప్రస్థానం -మౌలాలి రెడ్డి
1989లో కేవలం ఐదు మందితో మా నాన్న దస్తగిరి సెంటర్ ఇప్పుడు వేల మందికి బ్యాంక్ రంగంలో ఆహర్నిషలు చేసిన కృషి ఎంతో ఉందని డైరెక్టర్ అడుగుజాడల్లోనే ఈ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లిందుకు కృషి చేస్తానన్నారు. దస్తగిరిరెడ్డి ప్రారంభించిన ఈ బ్యాంక్ కోచింగ్ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో దస్తగిరి రెడ్డి మలాలి రెడ్డి పేర్కొన్నారు.
టైమ్ మేనేజ్ మెంట్ ఎంతో ముఖ్యం-దస్తగిరి రెడ్డి
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలంటే టైం మేనేజ్ మెంట్ ఎంతో ముఖ్యమయినదని బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఫౌండర్ దస్తగిరి రెడ్డి పేర్కోన్నారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తే వారు ఆర్థికంగా బలపడుతారని వారిలో ఆత్మ సైర్యం పెరుగుతుందన్నారు. అనంతరం ఉద్యోగం సాధించిన వారికి మెమోంటోలను ప్రధానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.