You are currently viewing మే 31న జరిగే సిద్దేశ్వరం జలదీక్ష ను విజయవంతం చేయండి

మే 31న జరిగే సిద్దేశ్వరం జలదీక్ష ను విజయవంతం చేయండి

  • Post category:Nandyal

రాయలసీమ ప్రజల స్పందన సిద్దేశ్వరం అలుగు ను వెంటనే చేపట్టాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి గారు అన్నారు. స్థానిక నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో సిద్దేశ్వరం అలుగు రాయలసీమ వెలుగు అనే నినాదంతో సిద్దేశ్వరం జలదీక్ష గోడ పత్రికను రామకృష్ణ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. నిత్యం కరువుతో సహజీవనం చేస్తున్న రాయలసీమ ప్రజానీకం తమ హక్కుల కోసం పోరాడి తమ కష్టాలు తొలగిపోతాయి అన్నారు. ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్ మాట్లాడుతూ రాయలసీమ న్యాయమైన కోరికలు సాధన కోసం సిద్దేశ్వరం దగ్గర జరిగే జల దీక్ష కార్యక్రమంలో రాయలసీమ ప్రజానీకం ప్రజాస్వామ్యవాదులుఅంతా స్వచ్చందం గా పార్టీలకు అతీతం గా అందరూ పాల్గొని మే 31న జరిగే జల దీక్ష కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం, నంద్యాల టౌన్ అధ్యక్షులు గులాబ్ హుస్సేన్, కోశాధికారి డిపి మస్తాన్ వలి, సభ్యులు సయ్యద్ మౌలాలి, నంద్యాల రూరల్ అధ్యక్షుడుఉమా మహేష్, బండి ఆత్మకూరు మండల అధ్యక్షులు సంపంగి రామరాజు, మీడియా ఇంఛార్జ్ నూర్ భాషా తదితరులు పాల్గొన్నారు.