ఇంజనీరింగ్ సర్వీసుల కింద అసిస్టెంట్ ఇంజనీరు పోస్టుల ఎంపిక నిమిత్తం ఈ నెల 15వ తేదీ ఆర్జిఎం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజి, శాంతి రామ్ ఇంజనీరింగ్ కాలేజి, ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఆన్ లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి పుల్లయ్య తెలిపారు. శనివారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం నందు అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్లైన్ పరీక్షలపై ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్షన్ అధికారులు, చీఫ్ కోఆర్డినేట్ అధికారులు, లైజన్ అధికారులతో కోఆర్డినేట్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్లైన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష
- Post published:May 14, 2022
- Post category:Nandyal