You are currently viewing కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కండి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కండి

  • Post category:Nandyal

నంద్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం సీపీఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ లో పిలుపునిచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రామాంజనేయులు నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్దికి సీపీఐ సమరసీల పోరాటాలకు సిద్ధం అవుతాం. నంద్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం26 జిల్లాలను విభజన చేయడం జరిగింది.అందులో భాగంగానే సీపీఐ పార్టీ గా కూడా అన్ని జిల్లాల విభజన సీపీఐ గా చేసుకోవడం జరిగిందని అందులో భాగంగానే నంద్యాల జిల్లా నూతన కమిటీ కార్యదర్శిగా రంగనాయుడు, సహాయ కార్యదర్శిగా బాబా ఫక్రుద్దీన్ ను ఎన్నికోవడం జరిగిందని శనివారం నంద్యాల సీపీఐ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.రామాంజనేయులు తెలిపారు. అంతే కాకుండ నంద్యాల జిల్లా ఏర్పాటు అనంతరం నంద్యాల సమగ్ర అభివృద్ధికి సాగునీరు ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని,విద్య, వైద్య ఉపాధి హక్కుల కోసం, రైతాంగ సమస్యల పరిస్కారం కోసం, కార్మిక, వ్యవసాయ కార్మిక రంగంలో నెలకొన్న సమస్యల పరిస్కారం మోసం నూతన సీపీఐ జిల్లా సమితి పనిచేస్తుందని వారు తెలిపారు.అంతే కాకుండా నంద్యాల జిల్లా కేంద్రానికి వివిధ సమస్యల పరిస్కారం కోసం వచ్చే దూరప్రాంత ప్రజానీకానికి అనువుగా రవాణా సౌకర్యాలు మెరుగు పరచాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న 105 మంది కాంట్రాక్టు ఉద్యోగులను అక్రమంగా తొలగించడం జరిగింది. ఈ విషయంలో హాస్పిటల్ సూపర్డెంట్, కలెక్టర్ వివిధ రూపాల్లో విన్నవించినా సమస్య పరిష్కారానికి రాలేదని, కావున గత 40 రోజులుగా కార్మికులు రిలే నిరాహారదీక్ష చేస్తూ కర్నూలు, నంద్యాలకు సబందించిన ఇద్దరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన న ఫలితం లేదు.తర్వాత సీపీఐ ఎ.ఐ.టి.యు.సి ఆధ్వర్యంలో తొలగించిన కార్మికులను తీసుకోవాలని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోని కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల సమస్య పరిస్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 జిల్లాల యూనివర్సిటీ లలో కూడా వీసిలు నియంత పాలన చేస్తూ,యూనివర్సిటీలని తమ జేబు సంస్థలుగా చేసుకొని విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని, రాయలసీమ యూనివర్సిటీ వీసి ఆనందరావు నియంతలా వ్యవహరిస్తూ రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాయలసీమ యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఏర్పాటు చేసి వారందరి ద్వారా విద్యార్థులను లోపలికి అనుమతి చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ రాయలసీమ యూనివర్సిటీ ని అక్రమాల యూనివర్సిటీగా తయారు చేసిన రాయలసీమ యూనివర్సిటీ వీసిని రీకాల్ చేసి విద్యారంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎ.ఐ.టి.యు.సి జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, ఎ.పి.జి.ఎస్ జిల్లా కార్యదర్శి మోట రాముడు, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు,ఎ.ఐ.కే.ఎస్ కార్యదర్శి సోమన్న, బి.కే.ఎం.యు కార్యదర్శి సుబ్బారాయుడు, సీపీఐ నాయకూలు కార్యకర్తలు పాల్గొన్నారు.