-పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు ఎస్.ఎమ్ డి .రఫీ
రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావును రీకాల్ చేయాలని కోరుతూ శాంతియుత ఆందోళన చేపట్టిన విద్యార్థి , యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్టులు చేయడాన్ని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు ఎస్.ఎమ్ డి.రఫీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యూజిల్లా అధ్యక్షులు ఎస్.ఎమ్ డి రఫీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో పలు అక్రమాలకు పాల్పడుతున్న ఉపకులపతి ఆనందరావును రీకాల్ చేయాలని కోరుతూ ఈరోజు ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్, ఎస్ఎఫ్ఎస్ఐ, పిడిఎస్యు, డిఎస్ఎఫ్, పి.డి.ఎస్.యూ, ఎఐఎస్ఎ విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడ ధర్నాచౌక్లో శాంతియుతంగా ధర్నాకు సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకుని విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్చసి వన్లైన్, భవానీపురం, అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు .పిడిఎసు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గనిరజు, రాజశేఖర్, రాష్ట్ర నాయకులు సునీల్, నాగరాజు, నవీన్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు, ఎస్ఎఫ్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్, పిడిఎస్టియు రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర, ఎఐఎస్ఎ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్న అనిల్ కుమార్ , బిడిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్, ఎఐఎస్ఎఫ్ నాయకులు శ్రీరామ్ గౌడ్ , బందెల నాసర్ , సాయి , ఓబులేసు , సోమన్న తదితరులను అరెస్టు చేశారు. పలువురిని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. ఎపీలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోంది . శాంతియుత ఉద్యమాలపై పోలీసులను ప్రయోగించి అరెస్టులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామిక హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కొనసాగడం విచారకరం. అరెస్టులు చేసిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాతంత్ర వాదులంతా అక్రమ అరెస్టులను ఖండించాలని కోరుతున్నాం. వైస్ ఛాన్సలర్ ఆనందరావును రీకాల్ చేయాలి. విసి అక్రమాలపై విచారణ జరిపించాలి. 153 మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలి. 13 మంది విద్యార్థులపై పెట్టిన అక్రమ సస్పెన్షన్, కేసులను ఎత్తివేయాలి. అక్రమ ప్రొఫెసర్లను ఉ న్నత పదవుల నుండి తొలగించాలి. నిర్మాణం పూర్తి అయిన నూతన భవనాలను ప్రారంభించాలి . డిగ్రీ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ జరపాలి. పరీక్షా విభాగంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని , విద్యార్థులపట్ల వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్న బిఎంఎస్ సెక్యురిటీ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.