You are currently viewing స్పందన అర్జీలు రీఓపెన్ కాకూడదు… బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్ళకూడదు

స్పందన అర్జీలు రీఓపెన్ కాకూడదు… బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్ళకూడదు

  • Post category:Nandyal

జగనన్న లేఅవుట్ల కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవాలి

మొదలు కాని ఇళ్లను వెంటనే ప్రారంభించండి

భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి

రెవెన్యూ అంశాలలో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించండి

వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో మండల తహసీల్దార్ లు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్పందన అర్జీలు, నీటి తీరువా పన్నుల వసూళ్లు, వన్టైమ్ సెటిల్మెంట్, జగనన్న హౌసింగ్, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జగనన్న శాశ్వత భూ హక్కు , భూరక్ష పథకం, పౌరసరఫరాలు, కోర్టు కేసుల సత్వర పరిష్కారం తదితర రెవిన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించి తాసిల్దారులు ప్రతిరోజు దృష్టి పెట్టి క్లియర్ చేయాలన్నారు. టాప్-4, టాప్ 10 లో సర్వీసులు పెండింగ్లో ఉండటం వల్ల బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళుతున్నాయని సంబంధిత మండల తాసిల్దార్ లు స్వయంగా చూసి పరిష్కార మార్గానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన పోర్టల్ ద్వారా ఎక్కడెక్కడ పెండింగ్ వుండే వివరాలను పంపిస్తున్నప్పటికీ అర్జీల పరిష్కారంలో తహసీల్దార్ తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న స్పందన అర్జీల పరిష్కారంలో ఫోన్ చేసి చెబితే తప్ప పరిష్కరించలేని స్థితిలో ఉన్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే టెక్నికల్ స్టాప్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలే తప్ప కారణాలు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. స్పందన దరఖాస్తులు రీ ఓపెన్ అయినా, బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్లిన సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీ ఓపెన్ అయి పెండింగులో ఉన్న 37 దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెండు రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కరించలేని దరఖాస్తులకు అసంపూర్తిగా రిప్లై ఇవ్వడం వల్లే ఫిర్యాదుదారులు సంతృప్తి చెందక మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారని కలెక్టర్ వివరించారు. జగనన్న లేఅవుట్ల కాలనీలలో ఇళ్ల నిర్మాణాలపై పూర్తిస్థాయి దృష్టి సారించి స్టేజ్ కన్వర్షన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభంకాని ఇళ్లన్నీ తక్షణమే ప్రారంభించి బిబిఎల్ స్థాయిలో ఉండేలా చూడాలన్నారు. బిబిఎల్ లో ఉన్న ఇళ్లని బిఎల్ లెవెల్ కు, బిఎల్ లెవెల్ లో ఉన్న ఇళ్లన్నీ రూప్ లెవెల్ కు వెళ్లి పూర్తయ్యేదశకు చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లాలో ఇంకా ప్రారంభం కాని ఇళ్లు 4000 వున్నాయని వెంటనే ప్రారంభించేందుకు అందరి భాగస్వామ్యం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజూ కనీసం రెండు కోట్ల ఎక్స్పెండిచర్ కు సంబంధించి బిల్లులు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి లేఅవుట్లో వంద గృహాలు ఆదర్శ గృహాలుగా నిర్మిస్తే లబ్ధిదారులు ముందుకు వచ్చి గృహాలు నిర్మించుకునేందుకు ఉత్సాహం చూపుతారని కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ 399 స్పందన అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్లాయని…ఎందుకు పెండింగ్లో ఉన్నాయని మండలాల వారీగా తాసిల్దార్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో రాష్ట్రంలో చివరి స్థానాల్లో ఉన్నామని రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప స్పందన అర్జీల పరిష్కారం కానీ, జగనన్న లేఅవుట్ల కాలనీలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావన్నారు. ఆన్ లైన్ కాని దరఖాస్తులను కూడా క్లియర్ చేయాలని ఆమె ఆదేశించారు. జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాలు, పరిశ్రమలకు అవసరమై పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు తాసిల్దార్ లు, రెవిన్యూ సర్వేయర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. ఇందుకు సంబంధించి ప్రతి గురువారం సిసిఎల్ఎ గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని… నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ కు అర్జీదారుల చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే తగు చర్యలు గైకొనాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి 973, డిజిటల్ సైన్ కు సంబంధించి 2600 పెండింగ్లో ఉన్నాయని వీటన్నింటిని రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు. జగనన్న స్మార్ట్ టౌన్ హౌసింగ్ స్కీమ్ కింద ఎం.ఐ.జి ప్లాట్లకు భూములు గుర్తించి రైతులతో నెగోషియేట్ చేసి సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు 75 శాతమే పంపిణీ అయ్యాయని సకాలంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి కంటెంట్ రాకుండా కౌంటర్ ఫైల్ చేయాలని జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ లను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ పుల్లయ్య, ల్యాండ్ అండ్ సర్వే ఎడి హరికృష్ణ, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు అంజన్ బాబు, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.