You are currently viewing గడపగడపకు వైసీపీ కార్యక్రమం

గడపగడపకు వైసీపీ కార్యక్రమం

  • Post category:Nandyal

గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ఆరో వార్డు లోని జగజ్జనని నగర్ ప్రాంతంలోఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ శాఖ భాష, మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది స్థానిక కౌన్సిలర్, సచివాలయ సిబ్బంది, వైయస్సార్ సిపి నాయకులు పాల్గొన్నారు. వార్డు ప్రజలు రోజు విడిచి రోజు మంచినీళ్ళను మున్సిపాలిటీ వారు విడుస్తున్నారని ప్రతిరోజు మంచినీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ స్తంభాలు ఇళ్లలోకి వచ్చాయని వాటిని రోడ్డుమీదికి మార్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి వెంటనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.